- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుస్సైన ‘శ్వేతామహంతి ఐఏఎస్’
దిశ,హైదరాబాద్ :
విధుల నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఆగ్రహం వ్యక్తంచేశారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమానికి ఆలస్యంగా విచ్చేసిన, గైర్హాజరైన 25 మంది అధికారులకు ఆమె షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ప్రతి సోమవారం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు.జిల్లా కలెక్టర్ నేతృత్వం వహించే ఈ ప్రజావాణికి జిల్లాలోని అన్నివిభాగాల ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది.కానీ, సోమవారం కలెక్టర్ సమావేశ మందిరానికి చేరుకున్నసమయంలో జిల్లా అధికారులు కొందరు సరైన సమయానికి రాకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు.దీంతో ప్రజావాణి కార్యక్రమానికి రాని, సకాలంలో హాజరుకాని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 25 మంది జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకేసారి 25 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం ప్రజావాణి చరిత్రలోనే మొదటిసారి అని తెలుస్తోంది.