- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్‌కౌంటర్‌లో జవాన్ల మిస్సింగ్.? వారంతా ఏమయ్యారు..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : శనివారం మధ్యాహ్నం బీజాపూర్, సుక్మా జిల్లాల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో కొంతమంది జవాన్లు మిస్సయినట్టుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు మూడు గంటల పాటు హోరాహోరిగా సాగిన ఎదురు కాల్పుల్లో బలగాల్లో సుమారు 1500 మందికిపైగా భద్రతా సిబ్బంది ఉన్నట్టుగా సమాచారం. పామెడు, సుక్మా, బీజాపూర్ జిల్లా తెర్రం, ఊసూరు, సుక్మా జిల్లా మినప, నర్సాపురం అటవీ ప్రాంతాల్లో వీరంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో కోబ్రా, బస్తర్ గార్డ్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
వీరు జోనాగుడా అటవీ ప్రాంతానికి చేరుకుంటారని ముందే పసిగట్టిన మావోలు పకడ్బందీ వ్యూహంతో దాడులు చేశారు. జోనాగుడా ప్రాంతానికి రహదారులను కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన మావోయిస్టులు.. అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకోకుండా నిలువరించారు. అనంతరం ముప్పేట దాడి చేయడంతో బలగాలు కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేశాయి. ఈ హోరాహోరి పోరులో ఇరువైపులా ప్రాణ నష్టం సంభవించింది.
అయితే కీకారణ్యంలో జరిగిన ఈ ఘటన తరువాత బలగాలు క్యాంపులకు చేరుకోగా గాయాలపాలైన వారిని, మృదేహాలను బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముఖ్యంగా కొంతమంది జవాన్లు గల్లంతు అయినట్టు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని అధికారులెవరూ దృవీకరించడం లేదు. వీరి ఆచూకి కోసం పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డట్టు సమాచారం. వారి కాంటాక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పోలీసు అధికారులు ఈ రోజు మధ్యాహ్నం వరకు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 21 మంది జవాన్ల వరకు మిస్సయినట్టుగా తెలుస్తున్నప్పటికీ ఇంకా కన్ ఫం కావడం లేదు.