ICC World Cup 2023: చేతికి నల్ల రిబ్బన్ కట్టుకున్న ఆసీస్ క్రికెటర్లు.. కారణమిదే

by Vinod kumar |
ICC World Cup 2023: చేతికి నల్ల రిబ్బన్ కట్టుకున్న ఆసీస్ క్రికెటర్లు.. కారణమిదే
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ధాటిగా ఆడుతోంది. ఇదిలా ఉండగా టాస్ తర్వాత జాతీయ గీతం ఆలపించేటప్పుడు ఆసీస్ ఆటగాళ్లు తమ మోచేతికి నల్ల రిబ్బన్ ధరించారు. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫవాద్ అహ్మద్ కొడుకు ప్రాణాలతో పోరాడి చనిపోవడమే దీనికి కారణం. అతని నాలుగు నెలల పాప అస్వస్థత కారణంగా ప్రాణాలతో పోరాడి ఆస్పత్రిలో చనిపోయింది. ఈ విషాద వార్తను విన్న క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. "ఫవాద్ కుమారుడు మరణించాడనే వార్త చాలా విచారానికి గురి చేసింది. అతని కుటుంబంపై మా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది" అని ట్వీట్ చేసింది. 2013 లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన ఫవాద్.. 3 వన్డేలు, 2 టీ 20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 3, టీ 20 ల్లో 3 వికెట్లు తీసుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed