Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ సక్సెస్ సీక్రెట్ అదే.. ముంబై మాజీ క్రికెటర్

by Vinod kumar |   ( Updated:2023-10-17 13:00:58.0  )
Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ సక్సెస్ సీక్రెట్ అదే.. ముంబై మాజీ క్రికెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్‌ రోహిత్ సక్సెస్ వెనకున్న సీక్రెట్‌ని ముంబై మాజీ క్రికెటర్ అమోల్ ముజుందార్ బయటపెట్టాడు. ICC World Cup 2023లో భాగంగా పాకిస్తాన్‌ మ్యాచ్‌లో భారత్ సూపర్ విక్టరీ సాధించిన తర్వాత రోహిత్ కెప్టెన్సీపై మాజీలు, విశ్లేషకులు నుంచి ప్రశంసలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమోల్ కూడా రోహిత్‌ను ఆకాశానికెత్తేశాడు. ఒకవైపు ఆటగాడిగా, మరోవైపు కెప్టెన్‌గా రోహిత్ సూపర్ సక్సెస్ కావడానికి అతడు ఫాలో అయ్యే కొన్ని విధానాలే కారణమని అమోల్ చెప్పుకొచ్చాడు. "రోహిత్ శర్మ ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అతి చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటాడు. ముఖ్యంగా మ్యాచ్ స్టాటిస్టిక్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు.

మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ళ ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. దాంతో వాళ్ళ వీక్ పాయింట్ ఏంటి? వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి? వాళ్లపై గెలవాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టంగా సమాధానాలు వెతుక్కోగలడు. అందుకే అతడు బెస్ట్ ప్లేయర్‌తో పాటు సూపర్ కెప్టెన్ కూడా కాగలిగాడు" అంటూ ముజుందార్ వివరించాడు. అంతేకాకుండా రోహిత్ ఏ విషయాన్ని కాంప్లికేట్ చేసుకోడని, క్లిష్టమైన సమస్యలను కూడా సింపుల్‌గా పరిష్కరించడానికి ట్రై చేస్తాడని చెప్పిన ముజుందార్.. జట్టు సభ్యులు కూడా తనలాగే ఆలోచించేలా, వాళ్లపై ఒత్తిడి లేకుండా చేయడంలో రోహిత్ స్పెషలిస్ట్ అని, అదే అతడి సక్సెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed