- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC World Cup 2023: ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత..
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ నయా రికార్డు సృష్టించాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో గ్రాహం గూచ్ పేరిట ఉన్న రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. బెయిర్‌స్టో ఔటవడంతో అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్.. 33.4 ఓవర్లో షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోసారి షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లోనే(35.4ఓవర్) 2 పరుగులు తీసి.. గ్రాహం గూచ్‌ను అధిగమించాడు. తద్వారా వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు..
1. జో రూట్- 898*
2. గ్రాహం గూచ్- 897
3. ఇయాన్ బెల్- 718
4. అలన్ లాంబ్- 656
5. గ్రేమ్ హిక్- 635.