- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ICC World Cup 2023: లాంగ్ బ్రేక్‌లో చిల్ అవుతున్న టీమిండియా..
దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో జరుగుతున్న ICC World Cup 2023లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా ప్లేయర్సంతా రిలాక్స్ అవుతున్నారు. ఆదివారం ధర్మశాలలో జరిగిన పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసి.. ప్రపంచకప్‌లో వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం తర్వాతి మ్యాచ్‌కు చాలా గ్యాప్ రావడంతో వారంతా ధర్మశాలలోనే ఉండిపోయారు.
ఈ విలువైన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ లాంగ్ బ్రేక్‌లో టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ ట్రెక్కింగ్‌కు వెళ్లింది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ రాస్ మాంబ్రే, మెడికల్ టీమ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ అంతా కలిసి ధర్మశాలలో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. టీమిండియా ఈ నెల 29వ తేదీన ఇంగ్లండ్‌తో తలపడనుంది.