- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫైనల్‌కు సిద్ధమే.. శుభ్‌మన్ గిల్
ముంబై : వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్‌కు తాను సిద్ధంగా ఉన్నానని టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. బుధవారం సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొడకండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ఓపెనర్ గిల్.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, అతని గాయంపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో తాను ఫిట్‌గానే ఉన్నానని, ఫైనల్‌కు సిద్ధమేనని గిల్ స్పష్టతనిచ్చాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ..‘మొదట తిమ్మిరితో మొదలై తొడకండరాలు పట్టేశాయి. డెంగ్యూ తర్వాతి ప్రభావం అనుకుంటున్నా. డెంగ్యూ తర్వాత నేను కొంత కండరాల ద్రవ్యరాశిని కోల్పోయాను. సాధారణంగా తేమ పరిస్థితుల్లో నాకు తిమ్మిరి రాదు. చాలా కాలం తర్వాత వచ్చింది.’ అని తెలిపాడు.
సెంచరీ మిస్ కావడంపై గిల్ స్పందిస్తూ.. తిమ్మిరి రాకపోతే తాను సెంచరీ కొట్టేవాడినని, కానీ, సెంచరీ మిస్ అవడం గురించి తాను ఆలోచించడం లేదని చెప్పాడు. కాగా సెమీస్‌లో గిల్ 66 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, 23వ ఓవర్‌లో తొడకండరాలు పట్టేయడంతో గిల్ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. ఆఖరి ఓవర్‌లో సూర్యకుమార్ అవుటైన తర్వాత గిల్ తిరిగి మైదానంలోకి వచ్చిన విషయం తెలిసిందే.