- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ODI World Cup 2023: 'అప్పుడు సచిన్ కోసం గెలిచాం.. ఇప్పుడు అతడి కోసం గెలవాలి'
దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా ఈసారి ఎలాగైనా ప్రపంచ కప్ గెలవాలని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. 2011లో సచిన్ టెండూల్కర్ కోసం భారత జట్టు వరల్డ్ కప్ నెగ్గిందని.. ఇప్పుడు అలాగే కోహ్లీ కోసం గెలవాలని కోరాడు. అప్పుడు ట్రోఫీ నెగ్గిన జట్టులో కోహ్లీ కూడా సభ్యుడనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టేడియంలో దిగిన ప్రతిసారీ కోహ్లీ తన నూరుశాతం ఎఫర్ట్ ఇస్తాడని.. ఈ వరల్డ్ కప్‌లో పిచ్‌లు కూడా అతని బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయని అనుకుంటున్నానని తెలియజేశాడు. అలాగే తాము 2011లో సచిన్ కోసం వరల్డ్ కప్‌లో రాణించామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా భారత్ అదే చేయాలని అభిప్రాయపడ్డాడు.
'మేం సచిన్ కోసం వరల్డ్ కప్ ఆడాం. మేం వరల్డ్ కప్ గెలిస్తే సచిన్‌కు అది గొప్ప వీడ్కోలు అవుతుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా సేమ్. అందరూ కూడా అతని కోసం వరల్డ్ కప్ గెలవాలని ఆడతారు. తను మైదానంలో ఎప్పుడూ వందకు అంతకన్నా ఎక్కువే కష్టపడతాడు' అని సెహ్వాగ్ అన్నాడు. 'విరాట్ కోహ్లీ కూడా ఈ వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నాడని నేను అనుకుంటున్నా. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష మంది తనను చూస్తుంటారు. విరాట్‌కు ఈ పిచ్‌లు ఎలా ఉంటాయో బాగా తెలుసు. తను ఈ టోర్నీలో చాలా పరుగులు చేస్తాడు. ఎలాగైనా ట్రోఫీ ముద్దాడేందుకు ప్రయత్నిస్తాడు' అని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.
Read More..
India ODI World Cup 2023 schedule : టీమ్ ఇండియా షెడ్యూల్ ఇదే..