IND Vs NZ ICC World Cup 2023: భారత్‌ను వెంటాడుతున్న ఆ గండం.. వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులు

by Prasanna |   ( Updated:2023-11-15 06:07:47.0  )
IND Vs NZ ICC World Cup 2023: భారత్‌ను వెంటాడుతున్న ఆ గండం.. వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులు
X

దిశ,వెబ్ డెస్క్: ప్రపంచ కప్‌ 2023లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. సెమీస్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ తో తలపడనుంది. ఈ రోజు మధ్యాహ్నం ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్‌లో ఉండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇప్పటివరకు ప్రపంచకప్‌ హిస్టరీలో భారత్ 8 సార్లు సెమీస్‌కు చేరుకుంది. కానీ ఇప్పటి వరకు రికార్డులు చూసుకుంటే విజయాల కంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయి. ఈ సారి ఆ గండం నుంచి తప్పించుకుని ఫైనల్ కి వెళ్తారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఒక సారి సెమీస్ రికార్డులు చూసుకుంటే..

1983 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలిసారి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 50 ఓవర్ల మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేయగా.. భారత్ 219 పరుగులకే ఆలౌటైంది.ఆ తర్వాత 1996, 2003,2011,2015 ఇలా సెమిస్, ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది. 2019 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఈ సీజన్ ప్రారంభం నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రయత్నిస్తోంది. ఈసారి భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. సొంతగడ్డపై మరోసారి విశ్వ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story