ICC World Cup 2023: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి ఆటగాడిగా..

by Vinod kumar |   ( Updated:2023-10-13 08:22:13.0  )
ICC World Cup 2023: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి ఆటగాడిగా..
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన నవీన్‌ ఉల్‌ బౌలింగ్‌లో ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. ఈ రికార్డును అందుకున్నాడు. రోహిత్‌ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 554 సిక్స్‌లు బాదాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌(553) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గేల్‌ రికార్డును హిట్‌మ్యాన్‌ బద్దలు కొట్టాడు.

Advertisement

Next Story

Most Viewed