ICC World Cup 2023: 'అతడు యార్కర్ల కింగ్‌.. వరల్డ్‌ కప్‌ జట్టులో ఉండాల్సింది'

by Vinod kumar |   ( Updated:2023-09-09 14:04:35.0  )
ICC World Cup 2023: అతడు యార్కర్ల కింగ్‌.. వరల్డ్‌ కప్‌ జట్టులో ఉండాల్సింది
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో లెఫ్ట్మ్‌ ఆర్మ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. గతేడాది వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్‌ పెద్దగా అకట్టుకోలేదు. కానీ టీ20ల్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ బౌలింగ్‌ కోచ్‌ అరుణ్‌ భరత్‌ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

అయితే ప్రస్తుత భారత జట్టులో లెఫ్ట్మ్‌ ఆర్మ్‌ పేసర్లు మాత్రం తక్కువగా ఉన్నారు. అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు అర్ధం కావడం లేదు. అతడు యార్కర్ల కింగ్ అని.. బాగా బౌలింగ్ చేయగలడు. స్లో బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. అతడు వరల్డ్‌కప్‌ జట్టలో లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. జట్టులో కనీసం ఒక లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అయినా ఉండాల్సిందని ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో భరత్‌ పేర్కొన్నాడు.

వరల్డ్‌ కప్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

Advertisement

Next Story