- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC World Cup 2023: మాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. నెదర్లాండ్స్ టార్గెట్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న 24వ లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగాడు. ఆఖరిలో గ్లెన్ మాక్స్‌వెల్ కేవలం 44 బాల్స్‌లోనే 106 పరుగులతో మెరుపు సెంచరీ చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 8 సిక్సిర్లు ఉన్నాయి. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్‌లకు 8 వికెట్లు కోల్పోయి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన వార్నర్.. 91 బంతుల్లో 11 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. ఈ సెంచరీతో వార్నర్.. వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ (7) తర్వాత ఆరు సెంచరీలతో సచిన్ టెండూల్కర్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ మిగిలిన బ్యాటర్స్‌లో.. స్టీవెన్ స్మిత్ (71), మార్నస్ (62) పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్‌లో.. లోగాన్ వాన్ బీక్ 4, బాస్ డి లీడే 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఒక వికెట్ తీశాడు.