'షకిబ్‌ను రెండుసార్లు అంపైర్లు అడిగారు'.. కీలక విషయాలను వెల్లడించిన విండీస్‌ మాజీ లెజెండ్

by Vinod kumar |   ( Updated:2023-11-07 10:50:26.0  )
షకిబ్‌ను రెండుసార్లు అంపైర్లు అడిగారు.. కీలక విషయాలను వెల్లడించిన విండీస్‌ మాజీ లెజెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్‌ ఏంజెలో మాథ్యూస్‌ ఔట్‌పై, బంగ్లాదేశ్‌ కెప్టెన్ వ్యవహరించిన తీరుపై మాజీ క్రికెటర్లు స్పందించారు. విండీస్‌ మాజీ లెజెండ్ ఇయాన్ బిషప్‌ స్టేడియంలో జరిగిన విషయాలను వెల్లడించాడు. అయితే క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని పలువురు క్రికెట్‌ మాజీలు అంటున్నారు. అంపైర్లు రెండుసార్లు అడిగినా.. బంగ్లా కెప్టెన్ షకిబ్ మాత్రం అంగీకరించలేదని వెస్టిండీస్‌ దిగ్గజం ఇయాన్‌ బిషప్‌ వ్యాఖ్యానించాడు.

నా ‘టైమ్‌’ ఇంకా ఉంది.. వీడియో ఆధారాలున్నాయ్‌: ఏంజెలో మాథ్యూస్‌

‘‘మాథ్యూస్‌ ఔట్‌ కోసం బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకిబ్‌ అప్పీలు చేశాడు. అప్పీలు చేసిన తర్వాత అంపైర్లు రెండుమార్లు షకిబ్‌ను అడిగారు. వెనక్కి తీసుకుంటావా? అని అడిగినా షకిబ్‌ మాత్రం రెండుసార్లూ ‘లేదు.. లేదు’ అని జవాబిచ్చాడు. దీంతో నిబంధనల ప్రకారం.. మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు’’ అని ఇయాన్ బిషప్‌ తెలిపాడు. ఈ సందర్భంగా 2007లో భారత బ్యాటర్ సౌరభ్‌ గంగూలీ కూడా ఇలానే ‘టైమ్డ్‌ ఔట్’ కావాల్సి ఉన్నప్పటికీ.. సౌతాఫ్రికా కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్ మాత్రం ఎలాంటి అప్పీలు చేయకుండా మన దాదా కోసం వేచి ఉన్నాడని పలువురు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

షకిబ్‌ తీసుకున్న నిర్ణయంపై మాజీ క్రికెటర్లు గౌతమ్‌ గంభీర్, డేల్‌ స్టెయిన్‌తోపాటు ఆసీస్‌ టెస్టు ప్లేయర్ ఉస్మాన్‌ ఖవాజా కూడా స్పందించారు. మరోవైపు ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం కావడం కూడా కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. టాప్‌-8లో ఉన్న టీమ్‌లు నేరుగా ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి. పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed