ఆస్ట్రేలియా‌కు షాక్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

by Mahesh |   ( Updated:2023-11-07 13:50:32.0  )
ఆస్ట్రేలియా‌కు షాక్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో కంగారుల జట్టుకు షాక్ తగిలింది. 292 పరుగుల లక్ష్యంతో చేజింగ్ దిగిన ఆస్ట్రేలియా జట్టు 10 ఓవర్లు కాక ముందు కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్ 18, హెట్ డకౌట్, మార్ష్ 24, జోష్ ఇంగ్లీష్ డకౌట్ అయ్యారు. ముఖ్యంగా అజామతుల్లా ఒమర్జీ వేసిన 8వ ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటర్లు లాబుచానే, మాక్స్‌వెల్ క్రీజ్ లో కొనసాగుతున్నారు.

Advertisement

Next Story