ICC World Cup 2023: క్రికెట్‌ ఫీవర్‌.. వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మద్దతుగా WWE సూపర్‌ స్టార్‌..

by Vinod kumar |
ICC World Cup 2023: క్రికెట్‌ ఫీవర్‌.. వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మద్దతుగా WWE సూపర్‌ స్టార్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్‌కప్‌ ఫీవర్‌ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) ని తాకింది. WWE సూపర్‌ స్టార్‌ ఒకరు టీమిండియాకు మద్దతుగా నిలిచారు. తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్‌లో స్టార్‌ రెజ్లర్‌ డ్రూ మెక్‌ఇన్‌టైర్‌ (Drew McIntyr) టీమిండియా జెర్సీ ధరించి రింగ్‌లోకి దిగాడు. ఈ పిక్‌ ప్రస్తుతం​ సోషల్‌ మీడియాలో వైరలవుతుంది. WWE లో ఒక్కసారిగా మెక్‌ఇన్‌టైర్‌కు క్రేజ్‌ పెరిగిపోయింది. సోషల్‌ మీడియాలో అతన్ని ఫాలో అయ్యే భారతీయుల సంఖ్య ఒక్కసారిగా రెండింతలయ్యింది. డ్రూ మెక్‌ఇన్‌టైర్ ఇటీవల భారత్‌లో పర్యటించినప్పడు కూడా ఇక్కడి వారిని ఆకట్టుకున్నాడు.

కొద్ది రోజుల కిందట ఓ ఈవెంట్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన మెక్‌ఇన్‌టైర్‌ భారతీయులతో మమేకమైపోయాడు. స్టార్‌ ఇమేజ్‌ కలిగిన మెక్‌ఇన్‌టైర్ హైదరాబాద్‌ నగర వీధుల్లో సాధారణ వ్యక్తిలా తిరుగుతూ భారతీయులకు, ముఖ్యంగా హైదరాబాదీలకు బాగా చేరువయ్యాడు. తాజా చర్యతో అతను భారతీయులకు మరింత దగ్గరయ్యాడు. 38 ఏళ్ల మెక్‌ఇన్‌టైర్‌ స్కాట్లాండ్‌కు చెందిన ప్రొఫెషనల్‌ రెజ్లర్‌ అన్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్‌ 2023 భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్‌ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది.

Advertisement

Next Story