ICC World Cup 2023: టాస్‌ పడకుండానే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ రద్దు..

by Vinod kumar |
ICC World Cup 2023: టాస్‌ పడకుండానే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ రద్దు..
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ వర్షం​కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. తిరువనంతపురంలో ఇవాల్టి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అంపైర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేశారు. మైదానం చిన్న సైజు​ చెరువులా మారడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవాళే మరో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు కూడా జరుగుతున్న విషయం తెలిసిం‍దే. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌.. గౌహతిలో శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పాక్‌ 21 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 99 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బాబర్‌ ఆజమ్‌ (41), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (34) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. 28 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అసలంక (18), ధనంజయ డిసిల్వ (17) క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed