ICC World Cup 2023: ప్రపంచకప్‌ చరిత్రలో చెత్త రికార్డు మూటగట్టుకున్న ఇంగ్లండ్‌ జట్టు..

by Vinod kumar |
ICC World Cup 2023: ప్రపంచకప్‌ చరిత్రలో చెత్త రికార్డు మూటగట్టుకున్న ఇంగ్లండ్‌ జట్టు..
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఆదివారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ చరిత్రలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అఫ్ఘాన్‌తో ఓటమితో టెస్టు క్రికెట్‌ ఆడే అన్ని జట్ల చేతిలో వన్‌ డే ప్రపంచకప్‌లో ఓటమిని ఎదుర్కొన్న తొలి జట్టుగా ఇంగ్లండ్‌ నిలిచింది. 1992 ప్రపంచకప్‌లో ఎవరూ ఊహించని విధంగా జింబాబ్వే చేతిలో ఇంగ్లండ్‌ ఓడిపోయింది. ఇక 1996 ప్రపంచకప్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించాయి. ప్రపంచకప్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించడం ఆ రెండు జట్లకు అదే తొలిసారి. ఆ తర్వాత 2011 ప్రపంచకప్‌లో చిన్న జట్లు అయిన బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌ కూడా ఇంగ్లండ్‌పై విజయం సాధించాయి.

ఇక ప్రస్తుతం ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ పసికూన అఫ్ఘానిస్థాన్‌ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్‌తోపాటు టెస్టు క్రికెట్‌ ఆడే మొత్తం 11 జట్ల చేతిలో ఆ టీమ్ వన్‌ డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో ఓడినట్లయ్యింది. ఈ విధంగా మరే జట్టు మూటగట్టుకోని చెత్త రికార్డును ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది.

Advertisement

Next Story