Ravichandran Ashwin: 'టీమిండియా ప్రపంచకప్ గెలవాలంటే.. ఆ కుర్రాడిని తీసుకోవాలి'

by Vinod kumar |
Ravichandran Ashwin: టీమిండియా ప్రపంచకప్ గెలవాలంటే.. ఆ కుర్రాడిని తీసుకోవాలి
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ క్రికెటర్ తెలుగు తేజం తిలక్ వర్మపై టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తిలక్ వర్మను ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.ద దీంతో టీమిండియా మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుందని తెలిపాడు. తిలక్ వర్మను ఇబ్బంది పెట్టే బౌలర్ ఏ టాప్‌ టీమ్‌లో లేడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. (39, 51, 49 నాటౌట్) వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రాణించాడు. 69.50 యావరేజ్‌ 139 స్ట్రైక్‌రేట్‌తో 139 పరుగులు చేశాడు.

పలువు స్టార్ ప్లేయర్లు వెస్టిండీస్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతుంటే తిలక్ వర్మ మాత్రం అలవోకగా షాట్లు కొడుతూ పరుగులు రాబడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా లెఫ్టాండర్ బ్యాటర్ల కోసం చూస్తోంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మను జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్ బలహీనతను అధిగమించవచ్చని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed