వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

by Aamani |
వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
X

దిశ,బెజ్జంకి : గ్రామీణ ప్రాంతాలలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బెజ్జంకి మండలంలోని చీలాపూర్ పల్లి గ్రామంలో స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో చిన్నారి గజ్జల రిషిక( 6) పై వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో తీవ్ర గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీధి కుక్కల దాడిని గమనించిన గ్రామ పంచాయతీ కార్మికుడు గజ్జల సంతోష్ 45 అతను చిన్నారిని కాపాడడానికి ప్రయత్నం చేయగా అతనిపై కూడా కుక్కలు దాడి చేశాయి.ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గంట వ్యవధిలోనే గుండారం గ్రామానికి చెందిన,మిర్యాల రమేష్ 36 అనే మరో వ్యక్తిపై వీధి కుక్క దాడి చేసింది.అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed