వివాదంలో పాక్ క్రికెటర్.. ఐసీసీకి ఫిర్యాదు

by Vinod kumar |
వివాదంలో పాక్ క్రికెటర్.. ఐసీసీకి ఫిర్యాదు
X

న్యూఢిల్లీ : పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ వివాదంలో ఇరుక్కున్నాడు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 6న పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌‌లో ఆట మధ్యలో రిజ్వాన్ నమాజ్ చేశాడు. మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేయడంపై సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందర్ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఐసీసీ రూల్స్‌ను ఉల్లంఘించిన అతనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే, మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేయడం ఇది మొదటిసారి కాదు. టీ20 వరల్డ్ కప్-2021లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ రిజ్వాన్ ఆట మధ్యలో నమాజ్ చేశాడు. అప్పుడు అతనిపై ఐసీసీ ఎలాంటి చర్య తీసుకోలేదు.

Advertisement

Next Story

Most Viewed