ICC World Cup 2023: అతడి వికెట్ లక్కీగా దక్కింది.. కుల్దీప్ యాదవ్

by Vinod kumar |
ICC World Cup 2023: అతడి వికెట్ లక్కీగా దక్కింది.. కుల్దీప్ యాదవ్
X

న్యూఢిల్లీ : పాక్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ వికెట్ కోసం తాను ఎలాంటి ప్రణాళికలు వేయలేదని, అది లక్కీ వికెట్ అని టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట ఇన్నింగ్స్‌ను పాక్ చక్కగానే నడిపించినా.. సిరాజ్ బౌలింగ్‌లో బాబర్ ఆజామ్ అవుటవడంతో ఆ జట్టు పతనం మొదలైంది. కాసేపటికే స్పిన్నర్ కుల్దీప్ ఒకే ఓవర్‌లో సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్‌లను అవుట్ చేసి పాక్‌ను కోలుకోని దెబ్బకొట్టాడు. ఇఫ్తికార్ బంతిని వేటాడి మరి స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డయ్యాడు.

మ్యాచ్ అనంతరం దీనిపై కుల్దీప్ మాట్లాడుతూ.. ‘ఇఫ్తికార్ కాళ్ల చుట్టు బంతులు వేయాలని నేను ప్లాన్ చేయలేదు. కానీ, నేను అనుకున్నట్టు బంతి వేయలేకపోయా. గూగ్లీ పడింది. ఆ బంతి దూరంగా పడింది. ఆ బంతిని స్వీప్ చేయడం అతనికి కష్టమైంది. ఇఫ్తికార్‌ వికెట్‌ లక్కీగా వచ్చింది.’ అని చెప్పాడు. అయితే, సిరాజ్ బౌలింగ్‌లో బాబర్ వికెట్ రావడమే హైలెట్ అని, ఆ తర్వాత తాను ఒకే ఓవర్ల రెండు వికెట్లు దక్కించుకోవడంతో పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిందని తెలిపాడు. ‘నేను వేసే బంతులను బ్యాటర్లు అర్థం చేసుకోవడం కష్టం. దాంతో ఆ బంతిని స్వీప్ ఆడాలా? మామూలు షాట్ ఆడాలా? అని బ్యాటర్లు సందిగ్ధంలో పడతారు.’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story