ICC World Cup 2023: సౌతాఫ్రికా వికెట్ కీపర్ సంచలన నిర్ణయం..

by Vinod kumar |
ICC World Cup 2023: సౌతాఫ్రికా వికెట్ కీపర్ సంచలన నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీల బ్యాటింగ్‌ వైఫల్యంతో సౌతాఫ్రికాకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇవాళ్లి మ్యాచ్‌తో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ టోర్నీలో 4 సెంచరీలతో రాణించిన అతడు 30 ఏళ్లకే వన్డేలకు వీడ్కోలు పలకడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మొత్తంగా తన చివరి వరల్డ్ కప్ టోర్నీలో 594 పరుగులు చేశారు. ఇది వరకే టెస్టులకు గుడ్‌బై చెప్పిన డికాక్.. ఇక నుంచి సౌతాఫ్రికా తరఫున కేవలం టీ20 మ్యాచ్‌లకు మాత్రమే ఆడనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed