ICC World Cup 2023: సౌతాఫ్రికా vs నెదర్లాండ్స్‌ మ్యాచ్ ఆరంభం.. వర్షం అంతరాయంతో తగ్గిన ఓవర్లు

by Vinod kumar |
ICC World Cup 2023: సౌతాఫ్రికా vs నెదర్లాండ్స్‌ మ్యాచ్ ఆరంభం.. వర్షం అంతరాయంతో తగ్గిన ఓవర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా సౌతాఫ్రికా vs నెదర్లాండ్స్‌ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ వర్షం అంతరాయం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా.. తొలుత ఫీల్డింగ్‌ ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. టాస్‌ తర్వాత వర్షం కురవడంతో ఆటకు అంతరాయం కలిగింది. సుమారు గంటపాటు కురిసిన వర్షం ఎట్టకేలకు తెరిపినివ్వడంతో అంపైర్లు ఈ మ్యాచ్‌లో ఓవర్లను తగ్గించారు. తాజా నిబంధనల ప్రకారం.. సౌతాఫ్రికా-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ను నిర్వాహకులు 43 ఓవర్లకు కుదించారు.

సుమారు రెండు గంటల తర్వాత ఆట ఆరంభమవడంతో పవర్‌ ప్లే నిబంధనలు కూడా మారాయి. తొలి పవర్‌ ప్లే 1-9 ఓవర్లు కాగా రెండో పవర్‌ ప్లే 36-43 ఓవర్ల మధ్య ఉండనుంది. సాధారణంగా ఒక బౌలర్ గరిష్టంగా పది ఓవర్లు వేసేందుకు అనుమతి ఉండగా.. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ముగ్గురు బౌలర్లు తొమ్మిది ఓవర్లు వేయనుండగా ఇద్దరు బౌలర్లు ఎనిమిది ఓవర్లు వేయాల్సి ఉంది.

దక్షిణాఫ్రికా:

క్వింటన్‌ డికాక్‌, టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్‌ డెర్‌ డసెన్‌, ఎయిడెన్‌ మార్క్‌రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్, డేవిడ్‌ మిల్లర్‌, మార్కో జాన్సన్‌, కగిసో రబాడా, కేశవ్‌ మహారాజ్‌, లుంగి ఎంగిడి, గెరాల్డ్‌ కొయేట్జీ

నెదర్లాండ్స్:

విక్రమ్‌జిత్‌ సింగ్‌, మాక్స్‌ ఓడౌడ్‌, కొలిన్‌ అకర్‌మన్‌, బాస్‌ డీ లీడె, తేజ నిడమనూరు, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (కెప్టెన్‌), సైబ్రాండ్‌ ఎంగెల్‌బ్రెక్ట్‌, రోయ్‌లోఫ్‌ వాన్‌ డెర్‌ మెర్వె, లొగాన్‌ వాన్‌ బీక్‌, ఆర్యన్‌ దత్‌, పాల్‌ వాన్‌ మీకెరెన్‌

Advertisement

Next Story

Most Viewed