ICC World Cup 2023: వరల్డ్‌కప్‌ రికార్డును సమం చేసిన ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌..

by Vinod kumar |
ICC World Cup 2023: వరల్డ్‌కప్‌ రికార్డును సమం చేసిన ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ జో రూట్‌ వరల్డ్‌కప్‌ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు క్యాచ్‌లు పట్టాడు. దీంతో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు ఆందుకున్న నాన్‌ వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. గతంలో మొహమ్మద్‌ కైఫ్‌ (2003లో శ్రీలంకపై), సౌమ్య సర్కార్‌ (2015లో స్కాట్లాండ్‌పై), ఉమర్‌ అక్మల్‌ (2015లో ఐర్లాండ్‌పై), క్రిస్‌ వోక్స్‌ (2019లో పాకి​స్తాన్‌పై)లు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో నాలుగు క్యాచ్‌లు పట్టిన నాన్‌ వికెట్‌ కీపర్ల జాబితాలో ఉన్నారు.

Advertisement

Next Story