ICC World Cup 2023: ఈసారి వరల్డ్ కప్ గెలిచేది మేమే : పాక్ ఓపెనర్

by Vinod kumar |
ICC World Cup 2023: ఈసారి వరల్డ్ కప్ గెలిచేది మేమే : పాక్ ఓపెనర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు. 1 లక్షా 30 వేల కెపాసిటీ ఉన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో దాయాదుల పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ గురించి పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇండియాలో మ్యాచ్ అంటే ఆ మాత్రం ప్రెషర్ ఉండడం కామన్. అందులో దాచాల్సింది ఏదీ లేదు. అయితే మా జట్టు అద్భుతాలు చేయగలదు. ఇండియాలో వన్డే వరల్డ్ కప్ గెలిస్తే, అది పాకిస్తాన్ టీమ్‌కి చాలా గర్వకారణం.. మేం దాన్ని సాధించగలమనే నమ్ముతున్నాం.. ఈసారి వరల్డ్ కప్ గెలిచేది మేమే.. అంటూ కామెంట్ చేశాడు.

ఇండియాలో ఇండియాతో మ్యాచ్ అంటే చాలా స్పెషల్. నేను బాబర్ ఆజమ్.. ఈ విషయం గురించి 2010లో మాట్లాడుకున్నాం. ఇండియాలో మ్యాచ్ ఆడితే ఆ వాతావరణం, ప్రేక్షకుల గోలలు.. ఆ ఫీల్ ఎలా ఉంటుందో చాలాసార్లు విన్నాం. దాన్ని అనుభూతి చెందడానికి ఆతృతగా ఎదురుచూస్తునామన్నాడు. 2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇండియాలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో రెండు మ్యాచులు ఆడబోతున్న పాకిస్తాన్ టీమ్.. చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా నగరాల్లో మిగిలిన వరల్డ్ కప్ మ్యాచులు ఆడనుంది. పాకిస్తాన్ సెమీస్‌కి అర్హత సాధిస్తే.. కోల్‌కత్తాలో సెమీ ఫైనల్ ఆడనుంది.

Advertisement

Next Story