ICC World Cup 2023: కేఎల్‌ రాహుల్‌కు స్పెషల్‌ అవార్డు..

by Vinod kumar |
ICC World Cup 2023: కేఎల్‌ రాహుల్‌కు స్పెషల్‌ అవార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా పాక్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఫీల్డ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే భారత ఆటగాళ్లకు జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ టి దిలీప్‌ బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డుతో పాటు మెడల్‌ను బహుకరిస్తున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఈ అవార్డును విరాట్‌ కోహ్లి దక్కించుకోగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అవార్డు శార్దూల్‌ ఠాకూర్‌ను వరించింది.

నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇమామ్‌ ఉల్‌ హాక్‌ క్యాచ్‌ను అద్భుతంగా అందుకోవడంతో పాటు వికెట్ల వెనక చాకచక్యంగా వ్యవహరించినందుకు గాను బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డుకు కేఎల్‌ రాహుల్‌ ఎంపికయ్యాడు. గత మ్యాచ్‌ విన్నర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఈ అవార్డును రాహుల్‌కు అందించాడు. ఈ అవార్డు ప్రధానోత్సవానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

Advertisement

Next Story