ICC World Cup 2023: ‘బుక్‌ మై షో’లో ప్రపంచకప్‌ టికెట్లు.. 2 వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనున్న భారత్

by Vinod kumar |
ICC World Cup 2023: ‘బుక్‌ మై షో’లో ప్రపంచకప్‌ టికెట్లు.. 2 వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనున్న భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ టికెట్లు ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ వేదిక ‘బుక్‌ మై షో’లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు బుక్‌ మై షోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత్ రెండు అధికారిక వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 30న గుహవాటిలో ఇంగ్లాండ్‌తో, అక్టోబర్‌ 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మేరకు ఐసీసీ ప్రకటన చేసింది.

Advertisement

Next Story