Glenn Maxwell: ప్రపంచకప్‌కు ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడు ఔట్!

by Vinod kumar |
Glenn Maxwell: ప్రపంచకప్‌కు ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడు ఔట్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ప్రాక్టీస్‌ సెషన్‌లో మాక్స్‌వెల్‌ కాలి మడమకు గాయమైంది. దీంతో వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు మ్యాక్స్‌వెల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడా లేదా వేచిచూడాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా మాక్స్‌వెల్‌ కాలి మడమకు గాయమైంది. దీంతో అతడు ప్రోటీస్‌తో టీ20 సిరీస్‌కు దూరమమ్యాడు. ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు స్మిత్‌, స్టార్క్‌, వార్నర్‌, గ్రీన్‌ గాయపడగా.. తాజాగా ఈ జాబితాలో ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ కూడా చేరాడు.

ఇక ఈ క్రమంలో అతడు తన భార్యతో కలిసి తిరిగి స్వదేశానికి పయనమైనట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అతడి స్ధానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. అయితే అతడు వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు మ్యాక్స్‌వెల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని ఆసీస్‌ మెనెజ్‌మెంట్‌ భావిస్తోంది. కాగా వన్డే ప్రపంచకప్‌కు 17 మంది సభ్యులతో కూడి ప్రిలిమనరీ జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆ జట్టులో మాక్స్‌వెల్‌కు కూడా చోటు దక్కింది.

Advertisement

Next Story

Most Viewed