- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
2020లో వీటిని మర్చిపోగలమా?
దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే 2020 ఏడాదిపై సోషల్ మీడియాలో చాలా మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కారణంగా 2020లో జరగాల్సిన ఎన్నో ఈవెంట్స్, ఫెస్టివ్స్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు తప్పక చరిత్రలో నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జనతా కర్ఫ్యూ నుంచి మొదలు.. మనకు మనమే ఓ లక్ష్మణ రేఖ గీసుకుని, అది దాటిరావొద్దని అనుకున్నాం. ఆనాటి నుంచి నేటి వరకు రోజులు గడుస్తూనే ఉన్నాయి.. క్యాలెండర్‌లో తేదీలు మారుతూనే ఉన్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఇంకా కుదుటపడటం లేదు. కరోనా ప్రజలను మరింత కలవరపెడుతోంది. అయితే ఈ ‘కరోనా రోజుల’ గురించి ఏదో ఒక రోజు మనం మన పిల్లలతో, మనవళ్లతో తప్పకుండా చర్చిస్తాం. ఈ అనుభవాలన్నింటినీ వారితో పంచుకుంటాం. కరోనా అనే సూక్ష్మజీవి ప్రపంచాన్ని వణికించిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు వినిపిస్తాం. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ మొదటి రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన కొన్ని విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
ముట్టుకోవాలంటేనే భయం :
తుపాకులు, బుల్లెట్లకే కాదు.. 2020లో కౌగిలింతలు, ముద్దులకు కూడా వణికిపోతున్నారు. కరెన్సీ నోట్లను ముట్టుకోవాలన్నా జనం బెంబేలెత్తిపోయారు. రోడ్ల మీద డబ్బుల కట్టలు కనపడ్డా.. తీసుకునేందుకు జంకారు. కూరగాయాలను, పాల పాకెట్లను తాకడానికీ సంకోచించారు. షేక్ హ్యాండ్స్‌కు సెలవిచ్చారు. అలయ్ బలయ్‌లకు అడ్డు చెప్పారు. ఏదీ తాకాలన్నా .. ఏం తెచ్చుకోవాలన్నా నూటికి నూరుసార్లు ఆలోచించారు. శానిటైజర్‌తో వాటిని శుభ్రం చేశారు. ఎండలో ఆరబెట్టారు. ఏదీ ముట్టినా చేతులను శుభ్రంగా సబ్బుతో కడుగుతున్నారు. ఇలా ఈ ఏడాదిలో ‘ముట్టుకోవడమంటేనే’ భయపడిపోయారు.
వర్చువల్ కన్సర్ట్స్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వీడియో పార్టీలు :
కరోనా కారణంగా ప్రజలు గుంపులుగా ఉండకూడదు. పార్టీలు చేసుకోకూడదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిషియన్స్ ఆన్‌లైన్ ద్వారా తమ మ్యూజిక్ కన్సర్ట్‌లను నిర్వహించారు. ఆన్‌లైన్ వేదికగా ప్రజలను అలరించారు. పబ్బులు, క్లబ్బులు, డీజే పార్టీలు లేవు. హ్యాంగవుట్స్ ప్లేసుల్లో బాతాఖానీ లేదు. అన్నీ బంద్.. అంతా గప్ చుప్. దాంతో మిలీనియర్స్ ఆన్‌లైన్ పార్టీలకు తెర తీశారు. ఇప్పుడు వీకెండ్స్ పార్టీలే కాదు.. ప్రతి రోజూ పండగే. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులు ఇలా అందరికీ ఇప్పడు ‘వీడియో కాలింగ్ యాప్‌లే’ ఆన్‌లైన్ పార్టీలకు సరికొత్త వేదికగా నిలుస్తున్నాయి.
క్లాపింగ్ అండ్ రింగింగ్స్ :
కరోనాతో యుద్ధంలో.. తమ ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా.. మార్చి 22న యావత్ భారత ప్రజలు తమ బాల్కనీల్లో, వీధుల్లో చేరి వారికి చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. ఏప్రిల్ 5న కూడా కరోనాపై పోరులో భాగంగా దీపాలు వెలిగించారు. హెల్త్ కేర్ వర్కర్స్ తో పాటు చుట్టూ ఉన్న వాళ్లలో సంతోషం నింపేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది సంగీత కళాకారులు, గాయకులు తమ బాల్కనీల్లో చేరి.. తమ సంగీతంతో పాటలతో వారిని అలరించారు.
వెడ్డింగ్స్ ఆన్ వీడియో కాల్స్ :
ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మన దేశంలో పెళ్లిల్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో లక్షలాది మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. కానీ, కొంతమంది వినూత్నంగా.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకుని సరికొత్త సంప్రదాయానికి స్వాగతం పలికారు. ఆత్మీయులు చనిపోయినా, బంధువులు మరణించినా, ఇంట్లో వాళ్లే పోయినా.. 20 మందికి మించకుండా ‘దహన సంస్కారం’ చేయాలి. మనల్ని ఎంతో ప్రేమించేవాళ్లకు చివరి చూపు కూడా దక్కకుండా అంతిమ సంస్కారం కానివ్వడం ఎంతో విషాదం, విచారకరం.
పోలీసుల చేతిలో ఢిపరెంట్ పనిష్మెంట్స్ :
లాక్‌డౌన్ కారణంగా ప్రజలెవరూ బయటకు రావద్దనే నిబంధన ఉన్న విషయం మనందరికీ తెలుసు. కానీ కొంతమంది అనవసరంగా బయటకు రావడంతో పోలీసులు వారికి భిన్నమైన పనిష్మెంట్లు ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించిన వాళ్లకు కొన్ని చోట్ల కప్ప దుంకుడు, మరికొన్ని ప్రాంతాల్లో బస్కీలు వంటి పనిష్మెంట్లు ఇచ్చారు. మరి కొన్ని ఏరియాల్లో ‘నేను నిబంధనలు అతిక్రమించాను. నాలా ఎవరూ చేయొద్దు’ అంటూ సెల్ఫీ స్పాట్‌లు ఏర్పాటు చేశారు.
ఆన్‌లైన్ క్లాస్ రూమ్స్ :
పాఠశాలలు, కాలేజీలు అన్నీ మూతపడ్డాయ్. పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చాలా పాఠశాలలు, కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు విద్యార్థుల్లో చాలామంది యూ ట్యూబ్, గూగుల్ ద్వారా ఆన్‌లైన్ కోర్సులు కూడా నేర్చుకుంటున్నారు.
హెయిర్ కట్ చేసుకోవాలంటూ పలు దేశాల్లో నిరసనలు చేపట్టడం, వైన్స్ షాపుల ముందు భారీ లైన్లలో నిల్చోవడం, ఆన్‌లైన్ వేదికగా రకరకాల చాలెంజ్‌లు, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు, గ్లోవ్స్ పెట్టుకోవడం, ఎంతోమంది సహృదయులు విరాళాలు అందించడం, అనాథలకు ఆహారం అందించడం, వలస కూలీల నడక యాతన, కాలుష్య తగ్గిపోవడం, గంగా నది నీళ్లు స్వచ్ఛంగా మారడం, జంతువులు రోడ్లపైకి రావడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. 2020లో చాలానే జరిగాయి. జస్ట్ రెండు, మూడు నెలల్లోనే ఓ డైరీకి సరిపడా గుర్తులున్నాయి.