- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంక చోప్రా@ 20 ఇయర్స్ ఇండస్ట్రీ
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన సినీ కెరీర్ ప్రారంభించి 20 ఏళ్లయిన సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ వీడియో షేర్ చేసింది. 2000 సంవత్సరంలో ‘అందాజ్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తను.. యూనివర్సల్ హీరోయిన్‌గా ఎదిగిన తీరును ఈ వీడియోలో చూపించింది. మూవీ క్లిప్స్, ఇంటర్వ్యూస్, టాక్ షోస్‌తో పాటు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ డేస్, అవార్డులు అందుకున్న మూమెంట్స్, యూనిసెఫ్‌కు అంబాసిడర్‌గా చేసిన రోజులు, నిక్ జోనస్‌తో పెళ్లి వరకు అన్నీ కూడా ఈ వీడియోలో సంక్షిప్తమై ఉన్నాయి.
పీపుల్ చాయిస్ అవార్డు అందుకున్న తొలి సౌత్ ఏషియన్ స్టార్ అయిన ప్రియాంక.. పద్మశ్రీ పురస్కారంతోనూ సత్కరించబడింది. రెండుసార్లు నేషనల్ అవార్డ్ గెలుచుకున్న నటిగా ప్రశంసలు అందుకుంది. సెల్ఫ్ మేడ్ స్టార్‌గా ఫోర్బ్స్, టైమ్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఆర్టికల్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేయడం విశేషం. బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకునే సమయంలో ‘బ్లాక్ గర్ల్ (ఫిల్మ్ ఫేర్ అవార్డ్)ను నైట్ తీసుకెళ్తే, ఫస్ట్ టైమ్ మా డాడ్ తిట్టకుండా ఉంటాడేమో’ అన్న తన మాటలకు తల్లిదండ్రులు.. అశోక్ చోప్రా, మధు చోప్రా నవ్వడం వీడియోలో హైలెట్‌గా నిలిచాయి.
కాగా కొత్తగా అమెజాన్ స్టూడియోస్‌తో మిలియన్ డాలర్ల ఫస్ట్ లుక్ టెలివిజన్ ఒప్పందం కుదుర్చుకుంది ప్రియాంక. తద్వారా గ్లోబల్ వైడ్‌గా ఉన్న టాలెంట్‌ను ఒకే తెర మీదకి తేవడంతో పాటు వైవిధ్యమైన అంశాలను ప్రజెంట్ చేసేందుకు కృషి చేస్తానని తెలిపింది.