- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణాల మీదకు తెచ్చిన ‘ప్రచారం’.. 20 మందికి గాయాలు.. మరో నలుగురి!
దిశ, హుజురాబాద్ రూరల్ : కరీంనగర్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయాలపాలవ్వగా నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన జిల్లాలోని హుజురాబాద్ మండలం రాజపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మండలంలోని ఇందిరానగర్ నుండి టాటా ఏస్ వాహనంలో హుజురాబాద్‌కు వస్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో నలుగురు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరంతా ఓ పార్టీ నిర్వహించనున్న ఎన్నికల సమావేశానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.