కోవాగ్జిన్ టీకా తీసుకున్న రెండేళ్ల బాలిక.. ఎక్కడంటే..!

by Shamantha N |
కోవాగ్జిన్ టీకా తీసుకున్న రెండేళ్ల బాలిక.. ఎక్కడంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తుగానే కేంద్రం పకడ్భందీ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే 18 ఏళ్లలోపు వారిపై కరోనా టీకా ట్రయల్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా దెహత్‌లో చిన్నారులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌‌కు యోగి సర్కార్ అనుమతించగా.. గురువారం రెండేళ్ల చిన్నారికి కోవాగ్జిన్ టీకా ఇచ్చారు.

వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా ఆస్పత్రి వైద్యుడు ఒకరు మట్లాడుతూ.. రెండేళ్ల చిన్నారికి తొలుత కోవాగ్జిన్ టీకా ఇచ్చామని అనంతరం రెండు గంటల పాటు ఆమెను పరిశీలనలో ఉంచామన్నారు. ఆ తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో తిరిగి ఇంటికి పంపించామన్నారు. కాగా, టీకా తీసుకున్న రెండేళ్ల చిన్నారి ఓ వైద్యుడి కూతురు కావడం గమనార్హం.

https://inshorts.com/en/news/2yrold-girl-gets-covaxin-dose-in-up-during-vaccine-trial-on-kids-1624546803749

Advertisement

Next Story