- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు భద్రతా అధికారులు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా పట్టణంలో ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్, మేజర్ సహా ఐదుగురు భద్రతా అధికారులు అమరులయ్యారు. అలాగే, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే.. చంగీముల్లా ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ఉగ్రవాదులు ప్రవేశించి, స్థానిక పౌరులను బందీలుగా ఉంచారన్న నిఘావర్గాల సమాచారంతో రాష్ట్ర పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంయుక్త ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు శనివారం మధ్యాహ్నం ఉగ్రవాదులున్న ఏరియాలోకి ప్రవేశించాయి. దాదాపు 8 గంటలపాటు ఆపరేషన్ కొనసాగించి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా, ఐదుగురు భద్రతా అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 21వ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశుతోశ్ శర్మ, మేజర్ అనుజ్, రైఫిల్ మ్యాన్ లేన్స్ నాయక్, ఎస్సై షకీల్ క్వాజీ, ఓ జవాను ఉన్నారు. ఆపరేషన్ అనంతరం పౌరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి.
Tags: Colonel, Major killed in action at J&K’s Handwara, 2 terrorists, encounter, deaths, Inidan army, jammu kashmir