- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే రోజుల్లో మహారాష్ట్ర సర్కారుకు మరిన్ని ఇక్కట్లు తప్పేలా లేవు. ఇప్పటికే ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ‘వసూళ్ల’ ఆరోపణలు ఎదుర్కొంటూ తన పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణకు సిద్ధమవుతుండగా.. బుధవారం సస్పెండ్ అయిన పోలీస్ సచిన్ వాజే ఎన్ఐఎకు విడుదల చేసిన ఒక లేఖ ఆ రాష్ట్ర క్యాబినెట్ లోని మరో మంత్రి అనిల్ పరబ్‌నూ ఇరకాటంలో పెట్టింది. ఇదిలాఉండగా.. మరో ఇద్దరు మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేయక తప్పదని బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఆరోపించారు. అంతేగాక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే సమయం కూడా ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ‘రాబోయే 15 రోజుల్లో మరో ఇద్దరు రాష్ట్ర మంత్రులు కూడా రాజీనామా చేయనున్నారు. వారికి వ్యతిరేకంగా పలువురు కోర్టులను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో వారు కూడా రాజీనామా చేయడం ఖాయం. పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి’ అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.