పేదలకు 5 వేలు, రెండు నెలల రేషన్ ఇవ్వాలి: బాబు

by srinivas |
పేదలకు 5 వేలు, రెండు నెలల రేషన్ ఇవ్వాలి: బాబు
X

కరోనా కారణంగా ఉపాధికి గండిపడి పూట గడవడానికి ఇబ్బంది పడే ప్రతి పేద కుటుంబానికి 2 నెలలకు సరిపడా రేషన్‌ను ఉచితంగా అందివ్వాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుతూ ధరలపై నియంత్రణ ఉంచాలని డిమాండ్ చేశారు. కూరగాయల రేట్లు 300 శాతం పెరిగినట్టు మీడియాలో చూస్తున్నామన్న ఆయన, బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని చెప్పారు. విపత్తులు సంభవించినప్పుడు బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత అని ఆయన తెలిపారు. విదేశాల నుంచి 15 వేల మంది రాష్ట్రానికి వచ్చినట్టు తెలుస్తోందన్న ఆయన, వారందర్నీ క్వారంటైన్ చేయాలని సూచించారు. పకడ్బందీగా ఐసోలేషన్ వార్డులు నిర్వహించాలని ఆయన సూచించారు.
Tags: chandrababu naidu, ap, tdp, corona virus, covid-19

Advertisement

Next Story

Most Viewed