- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బార్డర్ పెట్రోలింగ్‌కు భారత సంతతి శునకాలు!
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రక్షణ కోసం బార్డర్‌లో ఎముకలు కొరికే చలిలోనూ భారత సైనికులు విధులు నిర్వర్తిస్తుంటారు. 24×7 పెట్రోలింగ్ నిర్వహిస్తూ శత్రుదేశాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతుంటారు. కాగా భవిష్యత్తులో శునకాలు సైతం అక్కడ విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. అందుకోసం బీఎస్ఎఫ్(బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్).. షిల్లాంగ్‌లో రెండు భారత సంతతి శునకాలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు నిర్ణయించింది.
బీఎస్ఎఫ్, మేఘాలయ సీనియర్ పశువైద్యుడి వివరాల ప్రకారం.. ప్రస్తుతం ‘రాజపలయం, ముధోల్’ అనే రెండు రకాల ఇండియన్ బ్రీడ్స్‌కు ట్రయల్ బేసిస్‌లో శిక్షణనిస్తున్నారు. ఏడాది పాటు ఈ ట్రైనింగ్ ఉంటుందని, అది పూర్తయిన వెంటనే బార్డర్‌లో పెట్రోలింగ్ కోసం వీటిని వినియోగించనున్నట్లు చెప్పారు. ట్రయల్ సక్సెస్ అయితే మిలిటరీ శునకాల మాదిరి వీటితో పాటు ఇతర బ్రీడ్స్‌ను సైన్యంలో చేర్చుకుంటారని వివరించారు. బీఎస్ఎఫ్ మాత్రమే కాకుండా ఇండియన్ ఆర్మీ కూడా పలు ఇండియన్ డాగ్ బ్రీడ్స్‌ను ఫోర్స్‌లో జాయిన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాడు.