- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రాష్ట్ర రాజధానిలో రెండ్రోజులు సంపూర్ణ లాక్‌డౌన్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విపత్తు ముంచుకొస్తుంది. జులై నెలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండబోతుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో నొక్కిచెప్పారు. అయితే, దేశంలో పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని మళ్లీ లాక్ డౌన్ ఉంటుందని అందరూ ఆశించినా అలాంటిది ఏమీ ఉండబోదని కేంద్రం కుండ బద్దలు కొట్టింది. అనంతరం అన్‌లాక్ 2.0ను ప్రకటించింది. కంటైన్ మెంట్ జోన్లలో పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు ఎక్కవగా దృష్టి సారించాలని ప్రధాని మోడీ సూచించారు.
ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం రాజధాని బెంగుళూరులో రెండ్రోజులు సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5గంటల వరకు ఈ నిర్భంధం కొనసాగుతుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా బెంగుళూరులో ఇప్పటికే 20వేల పై చిలుకు కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.