చెకింగ్ లేదని.. ఐఫోన్లు కొట్టేశారు!

by Shyam |
చెకింగ్ లేదని.. ఐఫోన్లు కొట్టేశారు!
X

దిశ, వెబ్‌డెస్క్: వేతనాలివ్వట్లేదని ఇటీవల కర్నాటకలోని విస్ట్రన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ వద్ద.. ఆ సంస్థ ఉద్యోగులు విధ్వంసం సృష్టించి, వేల ఐఫోన్లను దొంగిలించిన సంగతి తెలిసిందే. తాజాగా హర్యానాలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకుంది. కాకపోతే ఇక్కడ జీతాల విషయమై కాదు. ఆఫీస్ ఎంట్రీ, ఎగ్జిట్ సమయంలో సెక్యూరిటీ చెకింగ్ లేకపోవడంతో ఉద్యోగులు దొంగతనం చేశారు.

అమెజాన్ కంపెనీ హర్యానాలోని బిలాస్‌పూర్‌లో వేర్‌హౌజ్ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి ఇతర ప్రాంతాల్లోని కస్టమర్లకు ప్రొడక్ట్స్ సరఫరా చేస్తోంది. అయితే కొవిడ్ నేపథ్యంలో బిలాస్‌పూర్ వేర్‌హౌజ్‌లోని సెక్యూరిటీ గార్డులు ఉద్యోగులను చెకింగ్ చేయడం ఆపేశారు. దాంతో ఆ సంస్థలో పని చేసే ఇద్దరు ఉద్యోగులు సొంత సంస్థకే కన్నం పెట్టి, స్టోర్‌లోని ఐఫోన్లను దొంగిలించారు. కాగా ఫోన్లు కనబడటం లేదని ఆఫీసర్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40 లక్షలు విలువ చేసే 38 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ చెకింగ్ లేకపోవడం వల్లే తాము చోరీ చేశామని నిందితులు ఒప్పుకున్నట్లు ఏసీపీ ప్రీత్‌పాల్ సింగ్ తెలిపారు.

Advertisement

Next Story