- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ‘చేప’
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఐపీఎల్ జోరు నడుస్తోంది. గత సీజన్‌లతో పోలిస్తే.. ఈసారి ప్రేక్షకుల సపోర్ట్ లేదు. కానీ పొట్టి క్రికెట్ మజాకు ఏమాత్రం ఢోకా లేకుండా మ్యాచ్‌లన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే యువ క్రీడాకారులతో పోటీపడుతూ సీనియర్లు కూడా తమ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకుంటున్నారు. క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చూపిన క్రీడాకారుడికి.. కప్, క్యాష్ లేదా కారును ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా’ అందిస్తారన్న సంగతి తెలిసిందే. కానీ, కశ్మీర్‌లో జరిగిన క్రికెట్ పోటీలో.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ఆటగాడికి 2.5 కిలోల చేపను అందించారు. ఎందుకలా చేశారు?
ఇటీవల కశ్మీర్‌లోని టెకీపొరా కుప్వారాలో ఓ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. మ్యాచ్ ముగియగానే అందులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్‌కు నిర్వాహకులు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా 2.5 కిలోల చేపను అందించారు. ఈ విషయాన్ని కశ్మీర్ జర్నలిస్ట్ ఫిర్దౌస్ హసన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది. దీని వెనకున్న ఉద్దేశ్యం.. ఆ లీగ్‌ను పాపులరైజ్ చేయడం ఒకటైతే, పూర్తిగా పాడైన అక్కడి క్రికెట్ గ్రౌండ్ పరిస్థితిని అందరికీ తెలియజెప్పడం ఇంకొకటి. ఇలా చేయడం వల్ల.. అధికారులు, లోకల్ లీడర్స్ క్రికెట్ గ్రౌండ్‌ను బాగు చేస్తారని వాళ్లు ఆశించారు.
ఈ విషయం పక్కనబెడితే, ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లోనూ.. వింతైన అవార్డులు అందించిన సందర్భాలు ఉన్నాయి. 2017లో ఇండియా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ‘మ్యాన్ ఆఫ్ ది సీరిస్’ అవార్డు గెలుచుకున్నారు. అతనికి ఆ అవార్డు కింద.. ఓ మినీ ట్రక్కును అందించారు. 2013లో జరిగిన డాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ రైస్ కుక్కర్‌ను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా అందుకున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో.. న్యూజిలాండ్ ప్లేయర్ అంటోన్ డేవిచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా ‘సన్‌షైన్ స్నాక్స్’ ఇచ్చారు.
Recently, in a cricket match at Tekipora Kupwara, a 2.5 Kg fish was given as Man of the Match award. #CricketDhamaka#ESPN #IPL2020 #kashmircricket pic.twitter.com/fQ7VAJ7Gvb
— Firdous Hassan (@FirdousHassan) September 21, 2020