- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రేమపేరుతో భర్త మోసాలు.. పట్టేసిన భార్య!
దిశ ప్రతినిధి, కరీంనగర్:
అతనో కామాంధుడు.. అమ్మాయిలు కనిపిస్తే చాలు మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించుతాడు. ఇలా ఒకరికి తెలీకుండా మరోకరిని వివాహం చేసకునేవాడు. ఇప్పటికే నలుగురు అమ్మాయిలు ఇతని వలలో పడినట్లు సమాచారం. ఒకరికి తెలియకుండా మరోకరితో గుట్టుచప్పుడు కాకుండా కాపురాలు చేస్తూ ఇన్నేళ్లు మేనెజ్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు తన భర్త చేస్తున్న మోసాన్ని గుర్తించిన మొదటి భార్య నడిరోడ్డులో అతనికి దేహశుద్ధి చేసింది.
వివరాల్లోకి వెలితే.. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన సంపత్‌కు మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలోనే సంపత్ కరీంనగర్‌లోని భారత్ థియేటర్ వద్ద ఓ గదిని అద్దెకు తీసుకొని అందులో మరో అమ్మాయితో సహజీవనం సాగిస్తున్నాడు.
గత కొద్ది రోజులుగా సంపత్ వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేసిన భార్య.. తన బంధువుల సాయంతో రెడ్ హ్యాండెడ్‌గా భర్తను పట్టుకుని దేహశుద్ది చేసింది. ఇంతకుముందు కూడా సంపత్ ఇద్దరు యువతులను ట్రాప్ చేసి.. గర్భవతులను చేసి వదిలేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు సంపత్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.