- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1984, 2020 అల్లర్లు.. తల్ల‘ఢిల్లీ’!
దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు 35 మందిని బలితీసుకున్నాయి. అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోం మంత్రి ప్రకటించిన తర్వాత, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ అల్లర్లు ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన అనంతరం కూడా హింస కొనసాగింది. బుధవారం రాత్రి మరోసారి హింసాపాతం జరిగింది. దీంతో మొత్తంగా ఈ అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 35కు చేరింది. ఇటుకలు, రాళ్లు, పెట్రోల్ బాంబులు, కర్రలు పట్టుకుని మూకలు బీభత్సం సృష్టించాయి. వాహనాలు, ఇళ్లు, దుకాణాలను తగులబెట్టాయి. మతపరమైన కట్టడాలను ధ్వంసం చేశాయి. ఇంతటి భయానక ఘటనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 1984 తర్వాత మళ్లీ ఈ అల్లర్లలోనే ఇంతటి హింస చోటుచేసుకుంది.
అల్లర్లకు రెచ్చగొట్టిన నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, లేదంటే ఢిల్లీ పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ హెచ్చరించారు. దీంతోపాటు 1984 అల్లర్లను ఢిల్లీలో పునరావృతం కానివ్వబోమని అన్నారు( రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన రోజు రాత్రే అతనికి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌లు వెళ్లాయి). ఈ కామెంట్‌తో 1984 అల్లర్లపై చర్చ మొదలైంది. ఈ అల్లర్లనే పేర్కొంటూ కేంద్రాన్ని విమర్శించిన కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు మండిపడ్డారు కూడా. ఇంతకీ 1984 అల్లర్లు ఎందుకు జరిగాయి? ఆ అల్లర్లకు ఇప్పుడు ఢిల్లీ అల్లర్లకు మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.
1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఇద్దరు సిక్కు బాడీగార్డులు చంపేసిన(ఆపరేషన్ బ్లూస్టార్‌పై ప్రపంచవ్యాప్తంగా సిక్కుల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు రగిలిన సందర్భంలో ఇందిరా గాంధీ హత్య జరిగింది) తర్వాత సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముందుండి నడిపించారని పౌర సంఘాలు, పాత్రికేయులు, బాధితులు చెబుతారు. ఇందులో ఢిల్లీలోనే సుమారు మూడు వేల మంది మరణించారు. ఒక నిజనిర్ధారణ కమిటీ రిపోర్టు ప్రకారం.. ఇందిరాగాంధీ హత్యతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. సిక్కులను టార్గెట్ చేసుకున్నారు. ఢిల్లీ తాగునీటిలో సిక్కులు విషం కలిపారని, సిక్కులు హతమార్చిన హిందువులు మృతదేహాలు పంజాబ్ నుంచి ట్రెైన్‌లో ఢిల్లీకి వస్తున్నాయంటూ కొన్ని వదంతలు 24 గంటల్లోనే వేగంగా వ్యాపించాయి(వాట్సాప్ లేని కాలంలో). ఇందులో పోలీసుల ప్రమేయమూ ఉన్నది. పోలీసులు మైక్‌లలో ఆ ట్రైన్ వచ్చేస్తున్నదన్నట్టు ప్రకటనలు చేయడం, తాగునీటిలో విషం కలిసిందని, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేయడం వంటివి భయభ్రాంతులకు, ఆగ్రహాలకు దారితీశాయి.
సిక్కుల ఊచకోతకూ పోలీసుల సహకారం ఉన్నట్టు ఆ రిపోర్టు తెలిపింది. కాంగ్రెస్ కార్యకర్తలు సిక్కుల ఇళ్లను గుర్తించగా.. మూకలు వారిని హతమార్చడం ప్రణాళికాబద్ధంగా జరిగింది. సిక్కు మహిళలపై సామూహిక అత్యాచారాలు, చంపేయడం, ఇళ్లు తగులబెట్టడంలాంటి బీభత్సం జరిగింది. 1984 అల్లర్లలో అట్టుడికిపోయిన త్రిలోక్‌పురిలో మూకను పోలీసులు స్వయంగా వాహనంలో తీసుకెళ్లి సిక్కుల ఇళ్ల ముందు దిగబెట్టిందన్న ఆరోపణలున్నాయి. సిక్కు యువతులపై అత్యాచారం జరుగుతుంటే.. ఎస్‌హెచ్‌వో, కానిస్టేబుళ్లను విధుల నుంచి ఉపసంహరించినట్లు అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. సుల్తాన్‌పురి ఎస్‌హెచ్‌వో ఇద్దరు సిక్కులను చంపేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, కొందరు హిందువులు.. తమ సిక్కు సహోదరుల పక్షాన నిలిస్తే వారినీ బెదిరించిన ఉదాహరణలున్నాయి.
1984 అల్లర్లు నాలుగైదు రోజుల్లోనే మూడు వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి. దాని వెనుక కాంగ్రెస్ నేతల హస్తముండటం, పోలీసుల సహకారం.. మూకలు చెలరేగడానికి తోడ్పడింది. తాజా అల్లర్లు, వదంతులూ, తప్పుడు వ్యాఖ్యానాలు, విద్వేష వ్యాఖ్యలే కాదు, ఆకస్మికంగా కాకుండా కొన్ని నెలలుగా సాగిన ద్వేషపూరిత ప్రసంగాల అనంతరం చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లకు పెద్దనేతలు కాకుండా కిందిస్థాయి లీడర్ల హస్తమున్నట్టు తెలుస్తున్నది. 1984లో దాదాపుగా నేతలందరూ అల్లర్లకు అభ్యంతరం చెప్పకపోగా, ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కపిల్ మిశ్రాపై బీజేపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి(కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగాలు ఆమోదనీయం కాదని బీజేపీ నేతలు మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్‌లు అన్నారు). అప్పట్లాగే.. నేడు కూడా తొలుత పోలీసులు అల్లరిమూకలపై కఠినవైఖరి తీసుకోలేదు. దానికి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు హింసాత్మకంగా మారబోతున్న ఆందోళనలను సీరియస్‌గా తీసుకొని ఉండకపోవచ్చు. లేదా మతపరంగా సున్నితమైన అంశాల్లో జోక్యం చేసుకుని ఒకవర్గానికి దూరం కావొద్దనే అభిప్రాయమూ ఉండొచ్చు.
మరోతేడా.. ఈ అల్లర్లు ఇంత వేగంగా వ్యాపిస్తాయని ఊహించలేనేదని ఓ బీజేపీ నేత అభిప్రాయపడినట్టు ఢిల్లీకి చెందిన పాత్రికేయుడొకరు తెలిపారు. అయితే, 2020 అల్లర్లను 1984కు పొడిగింపుగా అర్థం చేసుకోవచ్చు. 1984లో మెజార్టీ వర్గానికి ప్రభుత్వ సహకారం ఉండటంతో అప్పటి నుంచి తమకు సర్కారు మద్దతుంటుందని, సర్కారుతో విభేదించినవారు తమకు విరోధులనే భావం అంతర్లీనంగా ఏర్పడి ఉండే అవకాశముంది. ఇంకోవర్గం.. స్టేట్‌పై నమ్మకం కోల్పోయి ఉండొచ్చు. కాబట్టి.. కొన్ని వర్గాలు సర్కారుకు వ్యతిరేకంగా(ఉదాహరణకు సీఏఏను వ్యతిరేకించడం) వెళ్లడం మెజార్టీ వర్గానికి రుచించకపోవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అందరి అభిప్రాయాలను గౌరవించేలా ఢిల్లీ చరిత్రలోనే అత్యంత విషాద, భయానకమైన 1984 అల్లర్లను పునరావృతం కానివ్వబోమని జస్టిస్ ఎస్ మురళీధరన్ వ్యాఖ్యానించారు.