గాంధీ మరణానికి కారణాలు తెలిపే ‘1948 – అఖండ భారత్’

by Shyam |
Akhanda Bharat
X

దిశ, సినిమా: భారత జాతిపిత మహాత్మాగాంధీ హత్య నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘1948 – అఖండ భారత్’. గాంధీ మరణానికి గల కారణాలు, అప్పుడు చోటుచేసుకున్న పరిణామాలను తెలుపుతూ పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈ మేరకు అక్టోబర్ 2 మహాత్ముని జయంతి సందర్భంగా మూవీ యూనిట్ సినిమా పోస్టర్‌ని విడుదల చేసింది. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రం సుమారు 92 ముఖ్య పాత్రలతో భారీగా నిర్మాణం పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు నిర్మాత ఎం.వై.మహర్షి తెలిపారు. ఈ సందర్భంగా రీసెర్చ్ డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్‌ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ హత్యకు గురికావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని చెప్పారు. 70 సంవత్సరాలుగా దాచి పెట్టిన నిజాలను ప్రామాణికంగా పరిశోధన చేసి సినిమాకి స్క్రిప్ట్‌ తయారు చేశామని తెలిపారు.

Advertisement

Next Story