19ఆక్సిజన్ సిలిండర్లు పట్టివేత

by Shyam |
19ఆక్సిజన్ సిలిండర్లు పట్టివేత
X

దిశ, క్రైమ్‌బ్యూరో: అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లను విక్రయిస్తున్న వ్యక్తిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడలో నివసించే షేక్ అక్బర్ ముషీరాబాద్ సమీపంలోని ఇందిరానగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్‌లో అధిక రేట్లకు చట్ట విరుద్దంగా విక్రయిస్తున్నట్లు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు దాడి చేసి ఆక్సిజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story