Anupama Parameswaran: ఇలా చెప్పడం బాగుంది.. నిఖిల్‌కు ప్రపోజ్

by Shyam |   ( Updated:2021-06-01 03:49:57.0  )
Anupama Parameswaran:  ఇలా చెప్పడం బాగుంది.. నిఖిల్‌కు ప్రపోజ్
X

దిశ, సినిమా : ‘నా పేరు నందిని. నాకు మొబైల్‌లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితంపై రాయడమే ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవు. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది’ అంటూ హీరో నిఖిల్‌కు ప్రేమలేఖ రాసింది అనుపమ పరమేశ్వరన్. కళ్లకు గంతలు కట్టి మరి తన ప్రేమను వ్యక్తపరిచింది. నిఖిల్ బర్త్ డే సందర్భంగా 18 పేజెస్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు పల్నాటి సూర్యపత్రాప్ దర్శకులు కాగా.. సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed