తొలిసారి కర్నూలులో సింగిల్ డిజిట్ కేసులు.. ఏపీలో కరోనా @ 1887

by srinivas |
తొలిసారి కర్నూలులో సింగిల్ డిజిట్ కేసులు.. ఏపీలో కరోనా @ 1887
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తారస్థాయికి చేరుతోంది. ఏరోజుకారోజు పాజిటివ్ కేసుల సంఖ్య అర్థ సెంచరీలు దాటిస్తూ, అగ్రస్థానం దిశగా సాగిపోతోంది. అనంతపురంలో సెంచరీ దిశగా కేసులు సాగడం కాస్త ఆందోళన కలిగిస్తున్న విషయం కాగా, గడచిన 24 గంటల్లో 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. దీంతో ఏపీలో ప్రస్తుతం 1887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా కేసులకి రాజధానిగా మారిన కర్నూలు జిల్లాలో సింగిల్ డిజిట్‌లో కేసులు నమోదు కావడంతో అక్కడ కరోనా తగ్గుముఖం పట్టిందని అధికారులు చెబుతున్నారు. నేడు కర్నూలు జిల్లాలో కేవలం 7 కేసులు నమోదు కావడం విశేషం. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 547కి చేరింది. వారిలో 342 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 191 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 14 మంది మృత్యువాత పడ్డారు.

గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 1 కేసు నమోదైంది. దీంతో ఈ జిల్లాలో మొత్తం 374 కేసులు నమోదుకాగా, 164 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయితే 202 మంది చికిత్స పొందుతున్నారు. 8 మంది మరణించారు.

కృష్ణా జిల్లాలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 322కి చేరుకుంది. ఇందులో 185 మంది చికిత్స పొందుతుంటే, 126 మంది కోలుకున్నారు. 11 మంది మరణించారు.

ఊహించని విధంగా అనంతపురం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో ఒక్కసారిగా కేసుల సంఖ్య (99) సెంచరీకి చేరువైంది. 53 మంది చికిత్స పొందుతుంటే, 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. నలుగురు మృత్యువాత పడ్డారు. విశాఖపట్టణం జిల్లాలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. గడచిన 24 గంటల్లో 11 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కేసుల సంఖ్య 57 అర్ధసెంచరీ దాటింది. 33 మంది చికిత్స పొందుతుంటే, 23 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు మరణించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 9, చిత్తూరులో 3 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1887కి చేరుకుంది. వారిలో ఇప్పటివరకు 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారు. 1,004 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 1,56,681 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

tags: coronavirus, corona positive, covid-19, corona in ap, ap health department

Advertisement

Next Story

Most Viewed