- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలా ఒలిపింక్ గ్రామంలో.. 182 గదులు ఎందుకో తెలుసా ?
దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న అథ్లెట్లలో 88 మంది శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో జపాన్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆదివారం టోక్యో చేరుకున్న భారత అథ్లెట్ల కోసం నిర్వాహకులు ఒలింపిక్ గ్రామంలో గదులు కేటాయించారు.
భారత అథ్లెట్లు, సహాయక సిబ్బంది కోసం మొత్తం 182 గదులు కేటాయించారు. ఒక్కో గదిలో రెండు సింగిల్ బెట్లు ఉంటాయి. ఈ బెడ్లు అన్నీ కార్డు బోర్డుతో తయారు చేసినవే కావడం గమనార్హం. ఒక్కో కార్డు బోర్డు బెడ్ బరువు 200 కిలోలు ఉంటుంది. ఇక బెడ్ షీట్లు, టవల్స్, కట్లరీ అన్నింటిపైన టోక్యో ఒలింపిక్స్ లోగో ముద్రించి ఉంటుంది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత బెడ్లను పేపర్ ప్రొడక్టులుగా మార్చి అమ్మేస్తారు. ఇక మ్యాట్రెస్‌ల నుంచి ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ఇండియాలో క్వారంటైన్‌లో ఉండి, వ్యాక్సిన్ వేయించుకొని ఒలింపిక్స్‌కు వెళ్లినందున.. భారత అథ్లెట్లకు ఒలింపిక్ విలేజ్‌లో మూడు రోజుల ఐసోలేషన్ నుంచి మినహాయించారు.