- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రికి రాత్రే పెరిగిన కరోనా కేసులు..ఏపీ @180
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరోసారి విజృంభించింది. గత అర్ధరాత్రి వరకు స్తబ్దుగా ఉన్న కోరనా వైరస్ తెల్లారే సరికి జూలు విదిల్చింది. గతంలో సేకరించిన శాంపిల్స్ రిజల్ట్స్ వచ్చేసరికి పాత రికార్డులన్నీ తారుమారవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 180గా నమోదైనట్టు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.
నిన్నంతా కేవలం రెండు కేసులు మాత్రమే నమోదై రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చాయి. వైద్యఆరోగ్య శాఖాధికారులుకూడా కేసులు తగ్గుముఖం పట్టినట్టే భావించారు. ఇంతలోనే వారి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ రోజు ఉదయానికి మరో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 180 కాగా, అందులో నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో అత్యధికంగా 27, గుంటూరు, కడప జిల్లాల్లో 23 చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో మెజారిటీ వ్యక్తులు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం విశేషం.
Tags: corona, covid-19, andhra pradesh, health department