అక్రమంగా ఏపీకి మద్యం తరలిస్తున్న 18 మంది అరెస్ట్

by Shyam |
అక్రమంగా ఏపీకి మద్యం తరలిస్తున్న 18 మంది అరెస్ట్
X

దిశ, మహబూబ్ నగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అధిక ధరలు ఉన్నందునా తక్కువ ధరలు ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో మద్యంను కొనుగోలు చేసి ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు తరలించి అధిక ధరలకు విక్రయించేందుకు వారు ప్రయత్నించారు. కానీ, వారంతా పోలీసులకు చిక్కారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఈ 18 మందిని బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి 7 ద్విచక్ర వాహనాలు, రూ. 49,000 విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉండవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అలంపూర్ ఎక్స్ రోడ్ ప్రాంతం నుంచి కర్నూలు ప్రాంతానికి రహస్య మార్గం గుండా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఎర్ర స్వామి, వంశీ, సుధాకర్, బి.రవి, శివ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, మధు కృష్ణ, ఈశ్వరయ్య, ఎం .రవి, నరేందర్, శ్రీధర్, జయన్న, బి. ఈశ్వర్, సుజిత్ కుమార్, గోపాల్, మువ్వాలన్న, గొల్ల వీరేశ్, హరీఫ్ లు ఉన్నారు. సుజిత్ కుమార్ ది తక్షశిల గ్రామం కాగా మిగిలినవారు కర్నూల్ పట్టణం వెంకట రమణ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed