- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ దొంగలు.. 1,700 డోసులు మాయం
చండీగఢ్ : దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సిన్ కొరతతో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు కాస్తుంటే మరోవైపు పలువురు చోరులు ఈ ఆపత్కర పరిస్థితుల్లోనూ వారి ‘హస్తకళా ప్రావీణ్యాన్ని’ చూపుతున్నారు. హర్యానాలోని జింద్ జిల్లా సివిల్ హాస్పిటల్‌లో దాచి ఉంచిన 1,710 వ్యాక్సిన్ డోసులను దొంగిలించారు. ఇదే విషయమై గురువారం జిల్లా వైద్యాధికారి ఒకరు మాట్లాడుతూ… ‘జిల్లాలోని సివిల్ హాస్పిటల్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన పీపీసీ కేంద్రంలో భద్రపరిచిన 1,270 కొవిషీల్డ్, 440 కొవాగ్జిన్ డోసులను దొంగలు ఎత్తుకెళ్లారు. వాటితో పాటు పలు కీలకమైన ఫైళ్లనూ వాళ్లు దొంగిలించార’ని తెలిపారు. టీకాలను భద్రపరిచిన మేయిన్ డోర్ తెరవగానే అందులో ఉండాల్సిన వ్యాక్సిన్ డబ్బాలు కనిపించకపోయేసరికి తాను షాక్‌కు గురయ్యాయని ఆ అధికారి తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాక్సిన్ చోరుల కోసం గాలింపు మొదలుపెట్టారు.