థాయ్‌లాండ్‌లో ఘోరం… 17మంది మృతి

by Anukaran |   ( Updated:2020-10-11 01:34:37.0  )
థాయ్‌లాండ్‌లో ఘోరం… 17మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: థాయ్‌లాండ్ చాచియాంగ్‌సావోలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేగాకుండా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

Advertisement

Next Story